అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరించిన డీజీపీ
ABN , First Publish Date - 2021-10-29T00:25:04+05:30 IST
అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. ఇటీవల రైతుల పాదయాత్రకు డీజీపీ

అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. ఇటీవల రైతుల పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి నిరాకరించారు. పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని డీజీపీ చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 రాజధానులపై నిర్ణయం తీసుకుందన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు రైతులు తలపెట్టిన.. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ తేల్చి చెప్పారు.