విద్యా దీవెనలో మార్పులు

ABN , First Publish Date - 2021-11-29T05:29:11+05:30 IST

విద్యాదీవెన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

విద్యా దీవెనలో మార్పులు

ఫీజుల చెల్లింపులో నూతన విధానం

తల్లుల ఖాతా నుంచి నేరుగా కళాశాలకు బదిలీ

కళాశాలకు బకాయిలుంటే దీవెన చెల్లింపునకు బ్రేక్‌

ఈ నెల 29న 3, 4 విడతల చెల్లింపునకు సన్నాహాలు 


 గుంటూరు(విద్య), నవంబరు 28: విద్యాదీవెన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇంత కాలం విద్యాదీవెన నగదును విద్యార్థుల తల్లుల ఖాతాకు ప్రభుత్వం బదిలీ చేసేది. వారు ఆ మొత్తాన్ని కళాశాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించేవారు. అయితే చాలా మంది ఆ ఫీజులు కళాశాలకు చెల్లించకుండా సొంతానికి వాడుకుంటున్న ట్లు సమాచారం. దీంతో కళాశాలలకు ఫీజులు బకాయిలు పేరుకుపోతు న్నాయి. కళాశాలల నిర్వా హకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో విద్యా దీవెనలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. విద్యా దీవెన కింద చెల్లించే ఫీజులు ఇక నుంచి తల్లి ఖాతా నుంచి నేరుగా కళాశాల బ్యాం కు ఖాతాల్లో జమయ్యేలా నూతన విధానం తీసుకువచ్చారు. దీంతో విద్యా ర్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో జాప్యం లేకుండా కళాశాలలు ఇబ్బందుల పాలుకాకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన ఫీజులు కళాశాలలకు చెల్లించినట్లు ధ్రువీక రించిన తరువాతే 3, 4 విడతల ఫీజులు విడు దల చేయాలని నిర్ణయిం చారు. ఫలి తంగా విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే ఫీజులు తల్లిదం డ్రులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్టపడినట్లే.


గత తప్పిదాలతో కళాశాలలు ఇక్కట్లు

జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్‌, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు దాదాపు 30 వేల మంది ఉన్నారు. వారికి కళాశాలల్లో ప్రభుత్వం నిర్ధేశంచిన విధంగా ఫీజుల్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. రూ. 10 వేల నుంచి  3,4 విడతల్లో దాదాపు 35 వేల రూపాయల వరకు కోర్సుల వారీగా ఈ మొత్తాలు ఉండేవి. టీడీపీ  ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజులు నేరుగా కళాశాలల ఖాతాల్లో జ మ అయ్యేవి. విద్యార్థుల హాజరు ప్రకారం ఈ ఫీజులు విడతల వారీగా సకాలంలో విడుదలయ్యేవి. ఫలితంగా అటువిద్యార్థులు, ఇటు కళాశాల ల యాజమాన్యాలకు ఇబ్బందులు ఉండేవి కాదు. వైసీపీ ప్రభుత్వం వ చ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులో మార్పులు చేశారు. తమ ఘనతగా చెప్పుకునే క్రమంలో తొలుత విద్యార్థి తల్లి ఖాతాలోకి ఫీ జు నగదు బదిలీ చేయాలని, వారు కళాశాలలకు చెల్లించేలా మార్పులు చేశారు. అయితే ఈ విధానంలో దాదాపు 40 శాతం మంది ఫీజులు కళాశాలలకు చెల్లించకుండా సొంతానికి వాడుకోవడం మొదలు పెట్టారు. దీంతో కళాశాలకు రూ.కోట్ల లో ఫీజులు బకాయిలు పేరుకుపోయాయి. ఇలా రెండున్నరేళ్ల లో కళాశాలలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.


న్యాయస్థానాలకు వెళ్లడంతో..

ఫీజుల చెల్లింపులో వస్తున్న ఇబ్బందులపై కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. తొలుత ప్రభుత్వం చెల్లించే ఫీజు తల్లి ఖాతాకు బదిలీ అవుతుంది. వెం టనే ఆ మొత్తం కళాశాలకు నేరుగా బదిలీ చేసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పు లు చేశారు. ఫలితంగా తల్లిదండ్రులు ఫీజుల్ని సొంతానికి వాడు కునే విధానానికి అడ్డుకట్ట పడినట్లైంది. మరోవైపు 1,2విడతల్లో  ప్రభుత్వం తల్లుల ఖాతాలకు బదిలీ చేసిన మొత్తం ఫీజులు పూర్తిస్థాయిలో కళా శాలలకు చెల్లించి వారు ఇచ్చే రసీదు అప్లోడ్‌ చేసిన తరువాతే 3, 4 విడ తల ఫీజులు విడుదల చేస్తారు. లేకుంటే విద్యార్థికి ఫీజులు చెల్లింపు నిలిపివేస్తారు. ఫలితంగా బకాయిలు సొంతంగానే చెల్లించుకోవాల్సి వస్తుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ నెల 29న 3,4 విడతల్లో ఫీజులు చెల్లించ డానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం ప్రతి మండలానికి ఇద్దరు నోడల్‌ ఆఫీ సర్లను నియమించినట్లు అధికారు లు వెల్లడిం చారు. ఏవైనా సమస్యలుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని తల్లిదండ్రుల కు అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-11-29T05:29:11+05:30 IST