మిరపసాగుపై అవగాహన పెంచాలి

ABN , First Publish Date - 2021-08-28T04:56:20+05:30 IST

మిరపలో మెరుగైన సాగు విధానాలు, నాణ్యతపై రైతుల్లో అవగాహన పెంచాలని ఉద్యానశాఖ డీడీ సుజాత సూచించారు.

మిరపసాగుపై అవగాహన పెంచాలి
ప్రొజెక్టర్లను పంపిణీచేస్తున్న డీడీ సుజాత, ఏడీలు బెన్ని, కృష్ణారెడ్డి

ఉద్యాన శాఖ డీడీ సుజాత

గుంటూరు, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మిరపలో మెరుగైన సాగు విధానాలు, నాణ్యతపై రైతుల్లో అవగాహన పెంచాలని ఉద్యానశాఖ డీడీ సుజాత సూచించారు. గుంటూరు మండల కార్యాలయం కృషిభవనలో శుక్రవారం ఉద్యాన శాఖ, డిజిటల్‌ గ్రీనట్రస్ట్‌ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో  ఏడీలు బెన్ని, రాజాకృష్ణారెడ్డి, డిజిటల్‌ గ్రీనట్రస్ట్‌ ప్రతినిధులు కమలాకర్‌, మస్తాన, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ గ్రీనట్రస్ట్‌ సంస్థ ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి ఈపీకో ప్రొజెక్టర్‌లను అందజేశారు.

Updated Date - 2021-08-28T04:56:20+05:30 IST