పేదరిక నిర్మూలనకు నాబార్డు ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2021-12-31T06:00:43+05:30 IST

పేదరిక నిర్మూలనకు నాబార్డు ప్రాధాన్యం ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు.

పేదరిక నిర్మూలనకు నాబార్డు ప్రాధాన్యమివ్వాలి
ప్రసంగిస్తున్న చైర్మన్‌ లాలుపురం రాము

గుంటూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు నాబార్డు ప్రాధాన్యం ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు. బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. డ్వాక్రా సంఘాలకు రుణాలిస్తున్న తరహాలో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, యూనిట్లకు  నాబార్డు రుణాలివ్వాలన్నారు. సమావేశంలో సీఈవో కృష్ణవేణి, నాబార్డు ఏజీఎం భాస్కర్‌సాహు, అసిస్టెంట్‌ మేనేజర్‌ అశుతోష్‌రాయ్‌, ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌, పాలకవర్గ సభ్యులు కోట హరిబాబు, నల్లపాటి రామయ్య, పీటా వెంకటేశ్వర్లు, డి.గోవింద్‌నాయక్‌, వెలిశల ఏడుకొండలు, వట్టికొండ వెంకటేశ్వరమ్మ, ఆప్కాబ్‌ నోడల్‌ అధికారి టి.వెంకటేశ్వరరావు, నాబార్డు జిల్లా అధికారి కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-31T06:00:43+05:30 IST