దళిత ప్రతిఘటన ర్యాలీని విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-08-10T05:31:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ లెనినసెంటర్‌లో జరగనున్న దళిత ప్రతిఘటన ర్యాలీని జయప్రదం చేయాలని ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి బొల్లెద్దు సుశీలరావు పిలుపునిచ్చారు.

దళిత ప్రతిఘటన ర్యాలీని విజయవంతం చేయండి
సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ ఎస్సీ నేతలు

ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుశీలరావు

గుంటూరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ లెనినసెంటర్‌లో జరగనున్న దళిత ప్రతిఘటన ర్యాలీని జయప్రదం చేయాలని ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి బొల్లెద్దు సుశీలరావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  వైసీపీ పాలనలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు పెరిగాయని ఆరోపించారు. దళితులకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను వైసీపీ కాలరాస్తోందన్నారు. ఎస్సీ కార్పొరేషన రుణాలను పూర్తిగా సీఎం జగన నిలిపివేశారని ఐటీడీపీ గుంటూరు పార్లమెంటటు అధ్యక్షుడు తలతోటి సురేంద్ర పేర్కొన్నారు. టీడీపీ హయాంలో విదేశాల్లో చదువుకోవటానికి ప్రవేశపెట్టిన డాక్టర్‌ అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ పథకాన్ని రద్దుచేసి వైసీపీ ప్రభుత్వం దళితులను అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో దళిత నేతలు సౌపాటి రత్నం, లాం వర్ధనరావు, నవీన, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-10T05:31:15+05:30 IST