59 వేల ఎకరాల్లో పంట నష్టం

ABN , First Publish Date - 2021-11-21T05:40:48+05:30 IST

జిల్లాలో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 24 మండలాల్లోని 234 గ్రామాల్లో సుమారు 56 వేల ఎకరాల్లో వరి, మినుము, పత్తిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

59 వేల ఎకరాల్లో పంట నష్టం

ప్రభుత్వానికి జేడీ నివేదిక


గుంటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 24 మండలాల్లోని 234 గ్రామాల్లో సుమారు 56 వేల ఎకరాల్లో వరి, మినుము, పత్తిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి ప్రభుత్వానికి నివేదిక పంపారు. పంటపొలాల్లో నీరు బయటకు వెళ్లిన వెంటనే నష్టం అంచనాలపై తుది నివేదిక పంపు తామన్నారు. చేబ్రోలు 300, మంగళగిరి 50, పెదకూరపాడు మూడు ఎకరాల్లో మినుము పంట  దెబ్బతింది. కాకుమాను మండలంలో 120 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. 


 23 మండలాల్లో వరి.. 

పొన్నూరు మండలంలోని 22 గ్రామాల్లో  7,197 ఎకరాల్లో వరి, చేబ్రోలు మండలం 15 గ్రామాల్లో 6,500, అమర్తలూరు మండలం 12 గ్రామాల్లో 3,900, రేపల్లె మండలం 10 గ్రామాల్లో  3,654, భట్టిప్రోలు మండలం 11 గ్రామాల్లో 4,411, చెరుకుపల్లి మండలం 11 గ్రామాలలో 2,450, నగరం మండలం 12 గ్రామాల్లో 865, పెదకాకాని మండలం 12 గ్రామాల్లో 1,125, వట్టిచెరుకూరు మండలం 5 గ్రామాలలో  900, తెనాలి మండలం 12 గ్రామాల్లో 2,700, దుగ్గిరాల మండలం 15 గ్రామాల్లో 3,950, వేమూరు మండలం 12 గ్రామాల్లో 4,125, కొల్లూరు మండలం 15 గ్రామాల్లో 5,175, కొల్లిపర మండలం 12 గ్రామాల్లో 2,625, తాడేపల్లి మండలం రెండు గ్రామాల్లో 188, బాపట్ల మండలం 9 గ్రామాల్లో 1,300, కర్లపాలెం మండలం ఐదు గ్రామాల్లో 310, పిట్టలవానిపాలెం మండలం మూడు గ్రామాల్లో 87.5,  కాకుమాను మండలం  ఐదు గ్రామాల్లో 525, గుంటూరు మండలం రెండు గ్రామాల్లో 980, మంగళగిరి మండలం నాలుగు గ్రామాల్లో 400, పెదనందిపాడు మండలం ఐదు గ్రామాల్లో 263 వరి ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు.

Updated Date - 2021-11-21T05:40:48+05:30 IST