సైబర్‌ మోసం.

ABN , First Publish Date - 2021-02-26T05:44:29+05:30 IST

ఓ సైబర్‌ నేరగాడు తన పేరుతో చాటింగ్‌ చేసి నగదు వసూలు చేసినట్లు యడ్లపాడు పీహెచ్‌సీ ఉద్యోగి పెడవల్లి శ్రీనివాసరావు గుంటూరులోని సైబర్‌ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు.

సైబర్‌ మోసం.
బాధితుడు పెడవల్లి శ్రీనివాసరావు

యడ్లపాడు, ఫిబ్రవరి 25: ఓ సైబర్‌ నేరగాడు తన పేరుతో చాటింగ్‌ చేసి నగదు వసూలు చేసినట్లు యడ్లపాడు పీహెచ్‌సీ ఉద్యోగి పెడవల్లి శ్రీనివాసరావు  గుంటూరులోని సైబర్‌ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు.  ఈ నెల 22 నుంచి బాధితుడికి ఎడతెగని ఫోన్లు రావడంతో విషయం వెలుగుచూసింది. అత్యవసరంగా నగదు కావాలంటూ బంధుమిత్రులు, సహోద్యోగులతో జరిగిన చాటింగ్‌ చూసి ఆయన విస్తుపోయారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం అనంతవరంలోని వరుసకు బావమరిది అయ్యే ప్రైవేటు బస్సు డ్రైవర్‌ రావి తిరుమలరావు ఫోన్‌ చేసి ఈ నెల 21న వాట్సాప్‌ చూసి అకౌంట్‌కు రూ.70 వేలు పంపించినట్లు తెలిపారు. దీంతో శ్రీనివాసరావు సైబర్‌ మోసంపై యద్దనపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఇప్పటికి 50 మందికి పైగా నగదు  పంపించాలని తన ఫొటోతో వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చినట్లు తెలిసిందన్నారు.


Updated Date - 2021-02-26T05:44:29+05:30 IST