విద్యుదాఘాతంతో అంగనవాడీ ఆయా మృతి

ABN , First Publish Date - 2021-10-30T04:40:23+05:30 IST

మండలంలోని తురుమెళ్ళ గ్రామంలో శుక్రవారం అంగనవాడీ ఆయా ఉప్పులూరి ఎస్తేర్‌రాణి(30) విద్యాదాఘాతంతో మృతి చెందింది.

విద్యుదాఘాతంతో అంగనవాడీ ఆయా మృతి
ఎస్తేర్‌రాణి(ఫైల్‌ ఫోటో)

రొంపిచర్ల, అక్టోబరు 29: మండలంలోని తురుమెళ్ళ గ్రామంలో శుక్రవారం అంగనవాడీ ఆయా ఉప్పులూరి ఎస్తేర్‌రాణి(30) విద్యాదాఘాతంతో మృతి చెందింది. మరుగుదొడ్డి గేటు తీసే క్రమంలో కరెంటు తీగ గేటుకు తగిలి విద్యుత ప్రవాహం జరిగి షాక్‌కు గురైంది. నరసరావుపేటలోని ఓ ప్రెవేట్‌ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మునమాక సెక్టార్‌ పరిధిలోని అంగనవాడీ వర్కర్లు, ఆయాలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-10-30T04:40:23+05:30 IST