సీటీ శాఖ నరసరావుపేట డివిజన్‌ జేసీగా నాగజ్యోతి బాధ్యతలు స్వీకారం

ABN , First Publish Date - 2021-09-02T05:57:38+05:30 IST

వాణిజ్యపన్నులశాఖ నరసరావుపేట డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌గా డీ నాగజ్యోతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

సీటీ శాఖ నరసరావుపేట డివిజన్‌ జేసీగా నాగజ్యోతి బాధ్యతలు స్వీకారం
నాగజ్యోతికి అభినందనలు తెలియజేస్తున్న నాయకులు

గుంటూరు, సెప్టెంబరు 1: వాణిజ్యపన్నులశాఖ నరసరావుపేట డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌గా డీ నాగజ్యోతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేట డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమెను జేసీగా నియమిస్తూ గత నెలలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మొన్నటి వరకు జేసీగా పనిచేసిన కిరణ్‌చౌదరి మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దాంతో డీసీగా వ్యవహరిస్తున్న నాగజ్యోతిని జేసీగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నాగజ్యోతిని ఏపీసీటీఎన్‌జీవో అసోసియేషన్‌ నరసరావుపేట డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జే గోపినాథ్‌, కిషోర్‌కుమార్‌ తదితరులు అభినందించారు. 


Updated Date - 2021-09-02T05:57:38+05:30 IST