ఆస్తి కోసమే ఘాతుకం

ABN , First Publish Date - 2021-09-02T05:44:58+05:30 IST

జిల్లాలో సంచ లనం సృష్టించిన సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్యకు ఆస్తి వివాదమే కారణమని రూరల్‌ సీసీఎస్‌ ఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి తెలిపారు.

ఆస్తి కోసమే ఘాతుకం

గత నెల 28న తల్లీకూతుళ్లను హతమార్చిన బంధువు

సత్తెనపల్లి జంట హత్యల ఘటనలో నిందితుడి అరెస్టు  


గుంటూరు, సెప్టెంబరు1: జిల్లాలో సంచ లనం సృష్టించిన సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్యకు ఆస్తి వివాదమే కారణమని రూరల్‌ సీసీఎస్‌ ఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి తెలిపారు. సత్తెనపల్లిలోలో గత నెల 28న రాత్రి జరిగిన పద్మావతి, ఆమె కూతురు మానప్రగడ ప్ర త్యూష హత్యల కేసులో నిందితుడైన లారీ డ్రైవర్‌ కోనేరు శ్రీనివాసచక్రవర్తిని అరెస్టు చేసి నట్టు సీసీఎస్‌ ఎస్పీ తెలిపారు. బుధవారం గుంటూరులోని పోలీసు కార్యాలయంలో విలేక రుల సమావేశంలో నిందితుడిని మీడియా ఎదురు హాజరుపరచి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. బెల్లంకొండ మం డలం నందిరాజుపాలేనికి చెందిన కోనేరు లక్ష్మీ నారాయణకు ముగ్గురు కుమారులు, కుమా ర్తెలు ఉన్నారు. ఆయనకు నందిరాజుపాలెం, రాజుపాలెం గ్రామాల్లో సుమారు 6.34 ఎక రాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద కు మారుడు శివప్రసాదరావు వీఆర్వోగా పని చేస్తూ మృతి చెందాడు. ఆయన ఉద్యోగం కుమారుడు లక్ష్మీనారాయణకు వచ్చింది. శివ ప్రసాద్‌ కుమార్తె ప్రత్యూషకు ఇటీవల వివా హం జరగ్గా వారు హైదరాబాద్‌లో ఉంటు న్నారు. సత్తెనపల్లిలోని నాగార్జుననగర్‌లో శివ ప్రసాద్‌ భార్య పద్మావతి, కుమారుడు లక్ష్మీ నారాయణ ఉంటున్నారు. ప్రత్యూష నాలుగు నెలల గర్భిణికాగా ఇటీవలే పుట్టింటికి వ చ్చింది. లక్ష్మీనారాయణ రెండో కుమారుడు సం తానమైన శ్రీనివాసచక్రవర్తి లారీడ్రైవర్‌గా పని చేస్తూ కొంతకాలంగా గుంటూరులో ఉం టున్నాడు. అతని తల్లిదండ్రులు, ఆయన అ న్న, తమ్ముడు గతంలోనే మృతి చెందారు. కాగా శ్రీనివాసచక్రవర్తి వివాహం చేసుకోలేదు. అయితే ఇటీవల తన వైద్య చికిత్సకు డబ్బులు అవసరం కాగా తన తాత ద్వారా తనకు రావాల్సిన రెండెకరాల పొలాన్ని పంచాలంటూ  పిన్ని పద్మావతిని కోరుతున్నాడు. అయితే ఆస్తిలో వాటాను శ్రీనివాసచక్రవర్తి తండ్రి ముందే తీసుకున్నాడని పద్మావతి స్పష్టం చేసింది. ఈ విషయమై 15 రోజులుగా  పద్మావతి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నాడు.  వారి నుంచి స్పందన రాకపోవటంతో గత నెల 28న రాత్రి 7.30 గంటల సమయంలో నిందితుడు శ్రీనివాసచక్రవర్తి కత్తి తీసుకుని తన పిన్ని ఇం టికి వెళ్లాడు. అక్కడ  వాగ్వాదం చోటు చేసు కుంది. ఈక్రమంలో శ్రీనివాసచక్రవర్తి ఒక్క సారిగా తల్లీకూతురుపై దాడిచేసి విచక్ష ణారహితంగా కత్తితో పొడిచాడు. దీంతో స్థాని కులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొన ఊపిరితో ఉన్న పద్మావతిని ఓ ప్రైవేటు ఆస్ప త్రికి తరలించేందుకు యత్నించగా ఆమె కూ డా కన్నుమూసింది. ఈ మేరకు నమోదైన కే సులో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మే రకు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి పర్యవేక్షణలో సత్తెనపల్లి టౌన్‌సీఐ శోభన్‌బాబు మంగళవారం సాయంత్రం సత్తెనపల్లిలో నిందితుడు శ్రీనివాసచక్రవర్తిని అరెస్టు చేసి నట్టు సీసీఎస్‌ ఎస్పీ మూర్తి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన సీఐ శోభ న్‌బాబు, ఎస్‌ఐ రఘుపతిరావు, హెడ్‌ కానిస్టే బుల్‌ గంగాధరరావు, కానిస్టేబుళ్లు ఎస్‌ఎల్‌జే బాబు, గౌతం బుద్ధరామ్‌, ఎన్‌.కోటేశ్వరరావు, హోంగార్డు హఫీజ్‌లను అభినందించి రివార్డు లు అందించారు. 

Updated Date - 2021-09-02T05:44:58+05:30 IST