దాడిలో తమ్ముడి మృతి

ABN , First Publish Date - 2021-05-30T06:03:36+05:30 IST

పొలం వివాదంలో అన్న దాడి చేయగా తమ్ముడు మృతి చెందిన ఘటన మాచర్ల పట్టణ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.

దాడిలో తమ్ముడి మృతి

మాచర్ల, మే 29: పొలం వివాదంలో అన్న దాడి చేయగా తమ్ముడు మృతి చెందిన ఘటన మాచర్ల పట్టణ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. గురజాల మండలం పులిపాడుకు చెందిన బత్తుల శ్రీనివాసరావు(45), పిచ్చయ్య అన్నాదమ్ముళ్లు.  అన్న పిచ్చయ్య గుంటూరులో తమ్ముడు శ్రీనివాసరావు పులిపాడులో బంధువుల వద్ద ఉంటున్నారు.  వీరికి వెల్దుర్తి మండలం పట్లవీడులో పొలాలున్నాయి. ఈ పొలాల విషయంలో ఇద్దరికి వివాదం నెలకొంది. శుక్రవారం పట్టణ శివారులో కలిసిన వీరు మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిచ్చయ్య తన తమ్ముడు శ్రీనివాసరావును కర్రతో తలపై బలంగా మోదగా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని వైద్యం కోసం గుంటూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మాచర్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-30T06:03:36+05:30 IST