మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-14T05:03:40+05:30 IST

పట్టణంలోని బ్యాంకుకాలనీకి చెందిన చెన్నుపాటి ఆశాజ్యోతి(32) బుధవారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మహిళ ఆత్మహత్య

చిలకలూరిపేట టౌన్‌, జనవరి 13: పట్టణంలోని బ్యాంకుకాలనీకి చెందిన చెన్నుపాటి ఆశాజ్యోతి(32) బుధవారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశాజ్యోతికి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది.  కొన్ని రోజులే భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-14T05:03:40+05:30 IST