రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-13T05:51:56+05:30 IST

పిడుగురాళ్ల- వాడరేవు వద్ద దేచవరం రహదారి సమీపాన గోడౌన్స్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నకరికల్లు, జనవరి 12: పిడుగురాళ్ల- వాడరేవు వద్ద దేచవరం రహదారి సమీపాన గోడౌన్స్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రొంపిచర్ల మండలం విప్పర్ల శివారు సంగంలో నివాసముండే చలంచర్ల సాగర్‌(25) బైక్‌పై నరసరావుపేట వెళుతున్నాడు. ఈ క్రమంలో గోడౌన్స్‌ వద్ద వాహనం ఢీకొనడంతో సాగర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నకరికల్లు ఎస్‌ఐ పి.ఉదయబాబు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


విద్యుత్‌ ఛార్జీలపై 18 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

గుంటూరు, జనవరి 12: విద్యుత్‌ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన వార్షిక అవసరాల నివేదికపై ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాభిప్రాయం కోరనుంది. ఇప్పటికే ఏపీఈఆర్‌సీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు వారి అభిప్రాయాలను సమీపంలోని సర్కిల్‌ కార్యాలయాల్లో లేదా డివిజన్‌ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యక్తం చేయవచ్చని ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మ జనార్ధన్‌రెడ్డి ఓ ప్రకనటలో తెలిపారు.   

64,378 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు మంగళవారం మొత్తం 64,235 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 64,378 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 1,08,255 టిక్కీలు నిల్వ ఉన్నాయి. మంగళవారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.16,500, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.18,000, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.6,000, రూ.6,800 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీలకు రూ.6,000, రూ.14,500, ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.6,000, రూ.18,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500 ధర లభించినట్లు సెక్రెటరీ ఎం.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.


 థలసీమియా పిల్లలకు మెరుగైన చికిత్స

గుంటూరు (మెడికల్‌) జనవరి 8: థలసీమియా బాఽధిత పిల్లలకు ప్రభుత్వాస్పత్రి అండగా ఉంటుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి తెలిపారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి పిల్లల వైద్య విభాగంలో మంగళవారం ఉచిత రక్తమార్పిడి శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆరుగురు పిల్లలకు రక్తమార్పిడి చేశారు. కార్యక్రమంలో సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌కుమార్‌, పిల్లల వైద్యులు దేవకుమార్‌, అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌కుమార్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా కోశాధికారి రవి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:51:56+05:30 IST