యడవల్లి రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం
ABN , First Publish Date - 2021-10-20T05:36:10+05:30 IST
యడవల్లి గ్రామంలోని వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన దళిత, గిరిజన రైతులకు తక్కువ ధర చెల్లించి భూములు కాజేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
చిలకలూరిపేట, అక్టోబరు 19: యడవల్లి గ్రామంలోని వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన దళిత, గిరిజన రైతులకు తక్కువ ధర చెల్లించి భూములు కాజేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో యడవల్లి గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు విలేకర్లతో మాట్లాడుతూ ఆ భూమిలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయన్న ఉద్ధేశంతోనే భూములను తీసుకుంటున్నారన్నారు. ఎకరం రూ.50లక్షలు విలువ పలికే భూమికి మూడెకరాలకు కలిపి కేవలం రూ.25లక్షలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. సీఎం జగన్మోహనరెడ్డికి యడవల్లి భూముల విషయంలో లేఖ రాశానని, వారిని కలసి సమస్యను విన్నవిస్తామన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.కృష్ణయ్య, పశ్చిమజిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి.విజయ్‌కుమార్, వ్యవసాయకార్మికసంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మేశ్వరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాణి, రాష్ట్ర కౌలురైతులసంఘం అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, కౌలురైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు తదితరులు పాల్గొన్నారు.