మోదీ విధానాలకు వ్యతిరేఖంగా పోరాడాలి

ABN , First Publish Date - 2021-10-22T05:21:20+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేఖంగా ప్రతిఒక్కరూ పోరాడాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.

మోదీ విధానాలకు వ్యతిరేఖంగా పోరాడాలి
సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు

గుంటూరు(తూర్పు), అక్టోబరు 21: దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేఖంగా ప్రతిఒక్కరూ పోరాడాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేట మల్లయ్య లింగంభవనలో గురువారం వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సీపీఐ కార్యదర్శులకు జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. విశాఖ ఉక్కును కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి, రాదాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:21:20+05:30 IST