అమరావతినే రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-09-01T06:03:59+05:30 IST
రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగుందని ప్రభుత్వం స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ముప్పాళ్ల
గుంటూరు(తూర్పు), ఆగస్టు31: రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగుందని ప్రభుత్వం స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మల్లయ్య లింగంభవనలో మంగళవారం సీపీఐ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలకు ద్రోహం తలపెట్టడం క్షమించరానిదన్నారు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం రాష్ట్ర ప్రజలకు చెడు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్మించిదన్న ఒకే కారణంతో 95 శాతం పూర్తయిన టిడ్కో గృహలను లబ్ధిదారులకు ఇవ్వకుండా 27 నెలలుగా వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.860 కోట్లు మిగిల్చామని ప్రచారం చేసుకునే ప్రభుత్వం ప్రాజెక్ట్ ఆలస్యమవ్వడం వల్ల అందుకు ఎన్నో రెట్లు రైతుల నష్టపోయారన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. సమావేశంలో జంగాల అజయ్‌కుమార్, ముసునూరు రమేష్‌బాబు తదితరులు పాల్గొన్పారు.