కొవిడ్ మందుల కిట్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-22T04:43:11+05:30 IST
స్థానిక కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో సీతామహాలక్ష్మి సహకారంతో, ఆ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం దాదాపు వందమందికి కొవిడ్ మందుల కిట్లను పంపిణీ చేశారు.

గుంటూరు(తూర్పు), మే21: స్థానిక కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో సీతామహాలక్ష్మి సహకారంతో, ఆ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం దాదాపు వందమందికి కొవిడ్ మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలతోపాటు, స్వచ్ఛంద సంస్థలు కూడా కరోనా బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు. దేశంలో కరోనాను నియంత్రించడంలో విఫలమైన మోదీకి మరణశిక్ష విధించిన తప్పులేదని మండిపడ్డారు. ఆక్సిజన్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంతో రాష్ట్రంలో మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని ఆక్సిజన్ కొరతతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జంగాల అజయ్‌కుమార్, కోటా మాల్యద్రి. షేక్ అమీర్‌వలి, చల్లా మరియదాస్, మంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.