29 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-10-29T05:46:20+05:30 IST
కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది.

పాజిటివ్ శాతం 1.62గా నమోదు
గుంటూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది. గురువారం ఉదయం వరకు 1,787 శాంపిల్స్ టెస్టింగ్ జరగగా 29 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. పాజిటివ్ శాతం 1.62గా నమోదైంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిలో 32 మంది కోలుకోవడంతో క్రియాశీలక కరోన కేసుల సంఖ్య 380కి తగ్గింది. కొత్తగా గుంటూరు నగరంలో 8, తెనాలిలో 4, పొన్నూరులో 3, నిజాంపట్నంలో 2, రెంటచింతలలో 2, మంగళగిరిలో 2, అమరావతిలో 1, తాడేపల్లిలో 1, తాడికొండలో 1, దాచేపల్లిలో 1, బొల్లాపల్లిలో 1, నరసరావుపేటలో 1, దుగ్గిరాలలో 1, రేపల్లెలో 1 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.జయసింహా తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం రికార్డు స్థాయిలో 50,322 మందికి తొలి డోసు, 24,444 మందికి రెండో డోసు టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.