61 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-20T06:16:36+05:30 IST

ల్లాలో కొత్తగా 61 మందికి కరోనా వైరస్‌ సోకింది.

61 మందికి కరోనా

గుంటూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 61 మందికి కరోనా వైరస్‌ సోకింది. మంగళవారం ఉదయం వరకు 2,800 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా 2.18 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిలో 44 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసుల సంఖ్య 603కి తగ్గింది. కొత్తగా గుంటూరు నగరంలో 33, చిలకలూరిపేటలో 5, పెదకాకానిలో 3, కారంపూడిలో 3, తెనాలిలో 3, రేపల్లెలో 2, మంగళగిరిలో 2, నాదెండ్లలో 2, నరసరావుపేటలో 1, ప్రత్తిపాడులో 1, తాడేపల్లిలో 1, దాచేపల్లిలో 1, దుర్గిలో 1, పిడుగురాళ్లలో 1, భట్టిప్రోలులో 1, నిజాంపట్నంలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి అధికారి టీ జయసింహ తెలిపారు. కాగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 13,982 మందికి తొలిడోసు, 13,231 మందికి రెండో డోసు టీకా వేశామన్నారు. 


  

Updated Date - 2021-10-20T06:16:36+05:30 IST