84 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-14T05:35:49+05:30 IST

జిల్లాలో కొత్తగా 84 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారం ఉదయం వరకు 2,918 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2.88 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది.

84 మందికి కరోనా

గుంటూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 84 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారం ఉదయం వరకు 2,918 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2.88 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 20 మంది కోలుకోవడంతో క్రియాశీల కేసుల సంఖ్య 640కి తగ్గాయి. కొత్తగా గుంటూరు నగరంలో 39, తెనాలిలో 8, తాడేపల్లిలో 5, మంగళగిరిలో 4, క్రోసూరులో 3, సత్తెనపల్లిలో 3, గుంటూరు రూరల్‌లో 3, నరసరావుపేటలో 3, పిడుగురాళ్లలో 2, చేబ్రోలులో 2, వేమూరులో 2, చిలకలూరిపేటలో 1, రొంపిచర్లలో 1, బాపట్లలో 1, దుగ్గిరాలలో 1, కొల్లిపరలో 1, అమరావతిలో 1, తాడికొండలో 1, తుళ్లూరులో 1, వట్టిచెరుకూరులో 1, రెంటచింతలలో 1, పొన్నూరులో 1, చుండూరులో 1, అమర్తలూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం 16,966 మందికి తొలి డోసు, 11,844 మందికి రెండో డోసు టీకా వేశారు. 


Updated Date - 2021-10-14T05:35:49+05:30 IST