వ్యాపారులకు కరోనా పరీక్షలు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-06-22T18:14:42+05:30 IST

పురపాలక సంఘపరిధిలో..

వ్యాపారులకు కరోనా పరీక్షలు తప్పనిసరి

కమిషనర్


తెనాలి: పురపాలక సంఘపరిధిలో వ్యాపారాలు నిర్వహించే దుకాణదారులు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎం.జశ్వంతరావు అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ వ్యాపారులు నిర్వహించే ప్రతి దుకాణాదారుడు, వారి సహాయకులు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకుని రిపోర్టు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డాక్టర్లు మున్నంగి అనూష, బాల ప్రభావతి, ఆరోగ్యవిస్తరణాధికారి చంద్రమౌళి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T18:14:42+05:30 IST