129 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-08-28T05:00:59+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 129 మందికి కొత్తగా కొవిడ్‌-19 సోకింది. శుక్రవారం ఉదయం వరకు 6,437 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2 శాతం మందికి పా జిటివ్‌, 98 శాతం మందికి నెగెటివ్‌ వచ్చింది.

129 మందికి కరోనా

గుంటూరు, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 129 మందికి కొత్తగా కొవిడ్‌-19 సోకింది. శుక్రవారం ఉదయం వరకు 6,437 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 2 శాతం మందికి పా జిటివ్‌, 98 శాతం మందికి నెగెటివ్‌ వచ్చింది. కొత్తగా గుంటూరులో 31, చిలకలూరిపేటలో 7, మంగళగిరిలో 7, తాడేపల్లిలో 6, ప్రత్తిపాడులో 5, నరసరావుపేటలో 5, తుళ్లూరు, సత్తెనపల్లి, పొన్నూరు, పెదకాకానిలో నాలుగేసి, నకరికల్లు, వట్టిచెరుకూరు, మాచర్ల, పిడుగురాళ్ల, అమర్త లూరు, కర్లపాలెంలో మూడేసి,  మేడికొండూ రు, ముప్పాళ్ల, ఫిరంగిపురం, దాచేపల్లి, గుర జాల, ఈపూరు, బాపట్ల, దుగ్గిరాల, తెనాలిలో రెండేసి, పెదకూరపాడు, పెదనందిపాడు, రాజుపాలెం, అమరావతి, మాచవరం, వెల్దుర్తి, యడ్లపాడు, నూజెండ్ల, నూజెండ్ల, రొంపిచర్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, కొల్లిపర, కొల్లూరు, నిజాంపట్నం, రేపల్లెలో ఒక్కొక్కరికి పాజిటివ్‌ గా నమోదైనట్లు డీఎంహెచ్‌వో అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


20 లక్షలు దాటిన వ్యాక్సినేషన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వేస్తోన్న టీకాలను జిల్లాలో 20 లక్షల మందికి పైగా చేయించుకున్నారు. తొలి డోసు టీకాని 20 లక్షల 13 వేల 351 మంది, రెండో డోసు టీకాని 6 లక్షల 34 వేల 190 మంది చేయించు కొన్న ట్లు అధికారవర్గాలు తెలిపాయి. తొలి డోసు టీకాని 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 16 లక్షల 28 వేల 997 మంది, జనరల్‌ పబ్లిక్‌ 31,874, గర్భిణులు 12,088, ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలున్న తల్లులు 3,21,455, ఉపాధ్యా యులు 4,276 మంది చేయించుకున్నారు.   


నేడు మెగా వ్యాక్సినేషన్‌

జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా వ్యాక్సినేష న్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల వయస్సు వారికి టీకాలు వేయనున్నారు. సుమారు లక్షన్నర మందికి ఈ ఒక్క రోజే టీకా వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇం దుకోసం అవసరమైన కోవీషీల్డ్‌ టీకా డోసులను తెప్పించారు. శని వారం ఉదయానికి అన్ని గ్రామ/వార్డు సచివాలయాలకు తర లించి అక్కడ టీకాలు వేస్తారు.  



Updated Date - 2021-08-28T05:00:59+05:30 IST