101 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-08-22T05:01:49+05:30 IST

జిల్లాలో కొత్తగా 101 మందికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది.

101 మందికి కరోనా

2 శాతంగా పాజిటివ్‌ రేటు

మరో ముగ్గురు మృతి


గుంటూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 101 మందికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. శనివారం ఉదయం వరకు 5,038 శాంపిల్స్‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు సేకరించగా అందులో 2 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. కొవిడ్‌తో ఆరోగ్యం విషమించి మంగళగిరి, దుగ్గిరాల, నగరం మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మృతి చెందారు. తాజాగా 190 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసులు 1,167కి తగ్గాయి. కొత్తగా గుంటూరు నగరంలో 29, నరసరావుపేటలో 13, చిలకలూరిపేటలో 9, తాడేపల్లిలో 8, తెనాలిలో 7, మంగళగిరిలో 6, పెదనందిపాడులో 3, వినుకొండలో 3, బాపట్లలో 2, కొల్లిపరలో 2, నగరంలో 2, పెదకాకానిలో 2, ప్రత్తిపాడులో 2, అమరావతిలో 1, అచ్చంపేటలో 1, మేడికొండూరులో 1, ఫిరంగిపురంలో 1, కారంపూడిలో 1, మాచర్లలో 1, యడ్లపాడులో 1, ఈపూరులో 1, రొంపిచర్లలో 1, శావల్యాపురంలో 1, చేబ్రోలులో 1, కొల్లూరులో 1, చుండూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రెండో డోసు వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. శనివారం 5,790 మందికి రెండో డోసు, 3,111 మందికి తొలి డోసు టీకా వేసినట్లు వెల్లడించారు. 


Updated Date - 2021-08-22T05:01:49+05:30 IST