కరోనా ఎట్‌ 133

ABN , First Publish Date - 2021-08-21T05:23:13+05:30 IST

జిల్లాలో కొత్తగా 133 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఉదయం వరకు 6,419 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులో 2.07 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది.

కరోనా ఎట్‌ 133

గుంటూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 133 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఉదయం వరకు 6,419 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులో 2.07 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో నుంచి 84 మంది కోలుకున్నారు. రికవరీ శాతం 98.56కి చేరుకున్నది. గుంటూరు నగరంలో 44, తెనాలిలో 12, నరసరావుపేటలో 9, తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపరలో ఆరేసి, కర్లపాలెం, నిజాంపట్నంలో ఐదేసి, తాడికొండ, నాదెండ్ల, చుండూరులో మూడేసి, అమరావతి, ఫిరంగిపురం, అమర్తలూరు, నగరం, మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లిలో రెండేసి, బెల్లంకొండ, క్రోసూరు, మేడికొండూరు, పెదకాకాని, పెదకూరపాడు, ప్రత్తిపాడు, రాజుపాలెం, తుళ్లూరు, దాచేపల్లి, కారంపూడి, యడ్లపాడు, నకరికల్లు, రొంపిచర్ల, వినుకొండ, భట్టిప్రోలు, పొన్నూరులో ఒక్కొక్కరికి పాజిటివ్‌ వచ్చినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా వ్యాక్సినేషన్‌ చేశామన్నారు.  


Updated Date - 2021-08-21T05:23:13+05:30 IST