182 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-08-11T04:53:03+05:30 IST

కరోనా వైరస్‌ జిల్లాలో స్థిరంగా వ్యాప్తి చెందుతున్నది. ప్రధానంగా గుంటూరుతో పాటు చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, మంగళగిరిల్లో రెండు అంకెల కేసులు వస్తున్నాయి.

182 మందికి కరోనా

2.81 శాతంగా పాజిటివ్‌ రేట్‌

గుంటూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ జిల్లాలో స్థిరంగా వ్యాప్తి చెందుతున్నది. ప్రధానంగా గుంటూరుతో పాటు చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, మంగళగిరిల్లో రెండు అంకెల కేసులు వస్తున్నాయి. మంగళవారం ఉదయం వరకు 6,470 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా అందులో 182 మందికి కరోనా ఉన్నట్తు తేలింది. టెస్టింగ్‌ చేసిన ప్రతీ 100 మందిలో 2.81 శాతం మందికి వైరస్‌ సోకింది. దీంతో క్రియాశీలక కేసులు 1,596కి చేరుకున్నాయి. గుంటూరు నగరంలో 28, నరసరావుపేటలో 29, చిలకలూరిపేటలో 14, మంగళగిరిలో 11, తెనాలిలో 10, తాడికొండలో 8, తాడేపల్లిలో 6, దుర్గిలో 6, సత్తెనపల్లిలో 4, నాదెండ్లలో 4, నకరికల్లులో 4, వినుకొండలో 4, దాచేపల్లిలో 4, గుంటూరు రూరల్‌లో 3, మాచర్లలో 3, పిడుగురాళ్లలో 3, చేబ్రోలులో 3, చుండూరులో 3, పెదకాకానిలో 3, క్రోసూరులో 3, రాజుపాలెంలో 3, అమరావతిలో 1, అచ్చంపేటలో 1, పెదనందిపాడులో 2, ఫిరంగిపురంలో 2, గురజాలలో 2, కారంపూడిలో 2, రెంటచింతలలో 1, బొల్లాపల్లిలో 1, యడ్లపాడులో 1, ఈపూరులో 2, రొంపిచర్లలో 1, శావల్యాపురంలో 2, భట్టిప్రోలులో 2, కాకుమానులో 1, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 1, కొల్లూరులో 1, నిజాంపట్నంలో 1, పిట్టలవానిపాలెంలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


15 వేల మందికి వ్యాక్సినేషన్‌

కొవిడ్‌-19 వ్యాప్తిని ఎదుర్కోవడానికి కరోనా టీకా ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం 15 వేల మందికి పైగా వ్యాక్సిన్‌ చేయించుకున్నారు. వీరిలో 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 7,420, ప్రవాసభారతీయులు 283, ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలున్న తల్లులు 3,884, గర్భిణులు 283, దివ్యాంగులు 7, ప్రభుత్వ ఉపాధ్యాయులు 4, ప్రైవేటు టీచర్లు 12 మందికి తొలి డోసు, 4,008 మందికి రెండో డోసు టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 


Updated Date - 2021-08-11T04:53:03+05:30 IST