కరోనా.. 223

ABN , First Publish Date - 2021-07-12T06:07:03+05:30 IST

జిఆ్లలో ఆదివారం ఉదయం వరకు 7,277 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులో 223 మందికి కొవిడ్‌-19 సోకింది.

కరోనా.. 223

 పాజిటివ్‌ రేట్‌ 3.06 శాతం

గుంటూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిఆ్లలో ఆదివారం ఉదయం వరకు 7,277 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులో 223 మందికి కొవిడ్‌-19 సోకింది. పాజిటివ్‌ రేట్‌ 3.06 శాతంగా నమోదైంది. 290 మంది కోలుకోవడంతో ప్రస్తుతం కరోన క్రియాశీలక కేసులు 2,160కి తగ్గాయి. కరోనాతో దాచేపల్లి, పెదకాకాని, క్రోసూరులో ఒక్కొక్కరు మరణించారు.  ఇప్పటివరకు జిల్లాలో 1,66,711 మందికి కొవిడ్‌ సోకగా వారిలో 1,65,371 మంది కోలుకున్నారు. 1,180 మంది చనిపోయారు. కొత్తగా గుంటూరు నగరంలో 34, నాదెండ్లలో 13, అమరావతిలో 1, అచ్చంపేటలో 3, బెల్లంకొండలో 1, గుంటూరు రూరల్‌లో 1, క్రోసూరులో 1, మంగళగిరిలో 6, ముప్పాళ్లలో 1, పెదకాకానిలో 1, పెదకూరపాడులో 7, పెదనందిపాడులో 2, ఫిరంగిపురంలో 4, ప్రత్తిపాడులో 1, రాజుపాలెంలో 5, సత్తెనపల్లిలో 4, తాడేపల్లిలో 6, తాడికొండలో 2, తుళ్లూరులో 4, వట్టిచెరుకూరులో 4, దాచేపల్లిలో 6, దుర్గిలో 1, గురజాలలో 4, కారంపూడిలో 8, మాచవరంలో 4, మాచర్లలో 2, పిడుగురాళ్లలో 5, రెంటచింతలలో 2, వెల్దుర్తిలో 1, బొల్లాపల్లిలో 2, చిలకలూరిపేటలో 7, యడ్లపాడులో 4, ఈపూరులో 5, నరసరావుపేటలో 6, నూజెండ్లలో 4, నకరికల్లులో 3, రొంపిచర్లలో 8, శావల్యాపురంలో 4, వినుకొండలో 5, బాపట్లలో 3, చేబ్రోలులో 2, చెరుకుపల్లిలో 1, దుగ్గిరాలలో 6, కాకుమానులో 1, కొల్లిపరలో 5, కొల్లూరులో 2, నగరంలో 1, నిజాంపట్నంలో 1, పిట్టలవానిపాలెంలో 3, పొన్నూరులో 5, రేపల్లెలో 2, తెనాలిలో 8, చుండూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ నిల్వలు తక్కువగా ఉండటంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కి సెలవు పాటించారు.  


====================================================================================

Updated Date - 2021-07-12T06:07:03+05:30 IST