కరోనా ఎట్‌ 239

ABN , First Publish Date - 2021-07-08T06:26:30+05:30 IST

జిల్లాలో కొత్తగా 239 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. బుధవారం ఉదయం వరకు 7,517 శాంపిల్స్‌ ఫలితాలు రాగా పాజిటివ్‌ శాతం 3.18గా నమోదైంది.

కరోనా ఎట్‌ 239


పాజిటివ్‌రేట్‌ 3.18 శాతం


గుంటూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 239 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. బుధవారం ఉదయం వరకు 7,517 శాంపిల్స్‌ ఫలితాలు రాగా పాజిటివ్‌ శాతం 3.18గా నమోదైంది. 313 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసుల సంఖ్య 2,252కి తగ్గింది.  బెల్లంకొండ, తాడికొండ, గుంటూరు నగరంలో ఒక్కొక్కరు మృతి చెందారు. బుధవారం గుంటూరులో 39, తెనాలిలో 12, చిలకలూరిపేటలో 11, తాడేపల్లిలో 10, పిడుగురాళ్లలో 10, అమరావతిలో 6, అచ్చంపేటలో 9, బెల్లంకొండలో 3, మంగళగిరిలో 4, పెదకాకానిలో 7,  పెదనందిపాడులో 4, ఫిరంగిపురంలో 3,  రాజుపాలెంలో 3, సత్తెనపల్లిలో 4, తుళ్లూరులో 6, వట్టిచెరుకూరులో 3, దాచేపల్లిలో 8, గురజాలలో 9, కారంపూడిలో 6, బొల్లాపల్లిలో 4, యడ్లపాడులో 3, ఈపూరులో 4, నాదెండ్లలో 8, నరసరావుపేటలో 6, నూజెండ్లలో 8,  రొంపిచర్లలో 4,  భట్టిప్రోలులో 4, బాపట్లలో 4, దుగ్గిరాలలో 5 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయసింహ తెలిపారు. కాగా బుధవారం ప్రవాసభారతీయులు 22 మంది, ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలు ఉన్న తల్లులు 1,891 మంది, 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 1,804 మందికి తొలిడోసు టీకా వేసినట్లు ఏడీఎంహెచ్‌వో చెప్పారు. 1,449 మందికి రెండో డోసు వేశామన్నారు. 


పాజిటివ్‌ శాతం 5 దాటిన ప్రాంతాలు

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ 5 నుంచి 10 మధ్య నమోదు అవుతుంది. దీంతో ఆయా ప్రాంతాలపై  ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు ఆయా ప్రాంతాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం చిలకలూరిపేటటౌన్‌లో సుబ్బయ్యతోట, రంగన్నపాలెం, పీఎస్‌ పట్నం, యడ్లపాడు, రూరల్‌లోని వేల్పూరు, పసుమర్రు, మురికిపూడి, నూజెండ్లలో జడ్డవారిపాలెం, రాముడుపాలెం తండా, ముక్కెళ్లపాడు, మాచర్ల రూరల్‌లోని రాయవరం, గన్నవరం, పిడుగురాళ్లటౌన్‌లోని పిల్లలగడ్డ, ఎస్‌ఆర్‌ నగర్‌, జీపీ డొంక, పిడుగురాళ్ల రూరల్‌లోని తుమ్మలచెరువు, కరాలపాడు, జానపాడు, గురజాలలోని పులిపాడు, గోగులపాడు, మాడుగుల, గురజాల, ఈపూరులోని వైకేతండా, కొండయ్యపాలెం, రొంపిచర్లలోని శాంతగుడిపాడు, బీబీపాలెం, ఆలవాల, మునుమాక, తెనాలి రూరల్‌ నందివెలుగు, కఠెవరం, బుర్రిపాలెం, కారంపూడిలోని గాదెవారిపల్లె, కారంపూడి,  గుంటూరులోని రెడ్డిపాలెం, బ్రాడీపేట, విష్ణునగర్‌, శారదా కాలనీ, గాంధీనగర్‌, రత్నపురి కాలనీ, నరసరావుపేటలోని యల్లమంద, రావిపాడు, కేఎంఅగ్రహారం, అచ్చంపేటలోని మాదిపాడు, చింతపల్లి, గ్రంథసిరి, దాచేపల్లిలోని కాట్రపాడు, శ్రీనగర్‌, గామాలపాడు, బొల్లాపల్లిలోని పాలకూరు, వెల్లటూరు, నెహ్రూనగర్‌ తండాలో కరోనా పాజిటివ్‌ శాతం 5 నుంచి 10 మధ్య నమోదు అవుతుంది.

 

రాత్రి 10 వరకు ఆర్టీసీ సర్వీసులు

కర్ఫ్యూ సడలింపులతో నేటి నుంచి 

రీజియన్‌లో మరో 34 బస్సులు పెంపు

గుంటూరు: కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సడలించింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ ఎస్టీపీ రాఘవకుమార్‌ తెలిపారు. రీజియన్‌లో 13 డిపోల్లో ఇప్పటికే 567 బస్సులను తిప్పుతుండగా ఇకపై అదనంగా మరో 34 సర్వీసులను పెంచుతున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా డిపోల వారీగా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. 34 సర్వీసులను హైదరాబాద్‌ రూట్‌లో తిప్పుతున్నట్లు తెలిపారు.  



 

Updated Date - 2021-07-08T06:26:30+05:30 IST