కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడుగా ఉస్మాన్‌

ABN , First Publish Date - 2021-10-22T05:17:35+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడుగా పొన్నూరు రోడ్డు బారాఇమాంపంజాకు చెందిన షేక్‌ ఉస్మాన్‌ నియమితులయ్యారు.

కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడుగా ఉస్మాన్‌
ఉస్మాన్‌కు నియామక పత్రం అందజేస్తున్న మస్తాన్‌వలి, లింగంశెట్టి తదితరులు

గుంటూరు, అక్టోబరు 21: కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడుగా పొన్నూరు రోడ్డు బారాఇమాంపంజాకు చెందిన షేక్‌ ఉస్మాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీసీసీ పంపిన నియామకపు ఉత్తర్వులను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు   ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీభవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఏదైనా ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్‌ హయాంలోనే సాధ్యమైందన్నారు. సమాజంలో అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి కాంక్షించేది ఒక్క కాంగ్రెస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, అడవి ఆంజనేయులు, జక్కా శ్రీనివాస్‌, చుక్కా చంద్రపాల్‌, షేక్‌ కరీం, రత్తయ్య, సుభాని, బన్నీ, మోషే శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-22T05:17:35+05:30 IST