రాజీవ్‌గాంధీకి ఘన నివాళులు

ABN , First Publish Date - 2021-08-21T05:51:52+05:30 IST

గుంటూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం జరిగింది.

రాజీవ్‌గాంధీకి  ఘన నివాళులు
రాజీవ్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జేడీ శీలం, మస్తాన్‌వలి, లింగంశెట్టి తదితరులు

గుంటూరు, ఆగస్టు 20: గుంటూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం జరిగింది. మాజీ ఎంపీ జేడీ శీలం, ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు పలువురు నేతలు రాజీవ్‌గాంధీ భవన్‌లో,  అనంతరం ట్రావెలర్స్‌బంగ్లా సెంటర్‌లోనున్న రాజీవ్‌ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీసీసీ నాయకులు కొరివి వినయ్‌కుమార్‌, మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, కార్యదర్శి అడవి ఆంజనేయులు, గడ్డం పాల్‌విజయ్‌కుమార్‌, సుఽధీర్‌బాబు, కరీం, బ్రహ్మం, అనీల్‌, బన్నీ, నజ్మా, దుర్గా తదితరులున్నారు. 

యువత క్రీడలపై ఆసక్తి చూపాలి

యువత చదవుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి పేర్కొన్నారు. యూత కాంగ్రెస్‌ తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్‌ జబీవుల్లా ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ  జయంతి పురస్కరించుకొని పాతబస్టాండ్‌ వద్దనున్న ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జానీబాషా, హబీబుల్లా(బాబు), పర్వేజ్‌, సింహాద్రి, నవీన్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-08-21T05:51:52+05:30 IST