సర్వే వేగవంతం చేయాలి: కమిషనర్‌

ABN , First Publish Date - 2021-01-21T05:23:01+05:30 IST

సోషల్‌ ఎకనామిక్‌ ప్రొఫైలింగ్‌ సర్వే వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ బుధవారం మెప్మా సీవో, సీఎంఎంలను బుధవారం ఆదేశించారు.

సర్వే వేగవంతం చేయాలి: కమిషనర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), జనవరి 20: సోషల్‌ ఎకనామిక్‌ ప్రొఫైలింగ్‌ సర్వే వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ బుధవారం మెప్మా సీవో, సీఎంఎంలను బుధవారం ఆదేశించారు. అనంతరం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో మెప్మా పీడీ సావిత్రితో కలిసి నగరంలో పీఎం స్వానిధి, వైఎస్సార్‌ బీమా పథకాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి బ్యాంక్‌ బ్రాంచ్‌కి సీవో లేదా వెల్ఫేర్‌ కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. గురువారం సాయంత్రానికి సర్వే పూర్తి కావాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంక్‌లో బీమా పోర్టల్‌లో అప్‌ లోడ్‌ చేసేలా అధికారులతో మాట్లాడతామని తెలిపారు. సమావేశలోఓలో డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, వసంతలక్ష్మి, యలమందమ్మ, మెప్మా సీవో, సీఎంఎంలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T05:23:01+05:30 IST