నిర్దేశిత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-09T05:40:40+05:30 IST

గత వారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు నిర్దేశిత సమయంలో కూడా పరిష్కారం చేయని అధికారులపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనూరాధ పేర్కొన్నారు.

నిర్దేశిత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
అర్జీలను స్వీకరిస్తున్న కమిషనర్‌ చల్లా అనూరాధ

కమిషనర్‌ అనూరాధ

గుంటూరు(కార్పొరేషన్‌), నవంబరు 8: గత వారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు నిర్దేశిత సమయంలో కూడా పరిష్కారం చేయని అధికారులపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనూరాధ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నేరుగా స్వీకరించారు. సంక్షేమ పథకాలు, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలను స్పందనలో ఫిర్యాదు చేయాలన్నారు. వాటిని ప్రాధాన్యతక్రమంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందనలో 14 అర్జీలు వచ్చాయని, ఉపాసెల్‌కు రెండు, రెవెన్యూ విభాగానికి మూడు, పట్టణ ప్రణాళిక విభాగానికి రెండు, పరిపాలన విభాగానికి ఒకటి, ఇంజినీరింగ్‌ విభాగానికి ఆరు అర్జీలు వచ్చాయని వివరించారు. స్పందన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, సిటీప్లానర్‌ హిమబిందు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-09T05:40:40+05:30 IST