ఓటీఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-19T05:47:41+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్‌) పథకం లబ్ధిదారుల దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

ఓటీఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి
సచివాలయంలో తనిఖీలు చేస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు

సచివాలయ తనిఖీలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్‌) పథకం లబ్ధిదారుల దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బుడంపాడు 195వ వార్డు సచియాలయంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల పరిష్కారాన్ని   మండల స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి ఉద్యోగులకు అవసరమైన సూచనలు అందించాలన్నారు. కార్యక్రమంలో తూర్పు మండల తహసీల్దారు శ్రీకాంత్‌, నగరపాలక సంస్థ డీసీ వెంకటకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-19T05:47:41+05:30 IST