భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత

ABN , First Publish Date - 2021-11-27T05:04:30+05:30 IST

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైన లిఖిత రాజ్యాంగమని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అన్నారు. ఎంతో మహనీయత కలిగిన రాజ్యాంగాన్ని కాపాడుకొనే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు.

భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత
అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, జేసీ

రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, నవంబరు 26: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైన లిఖిత రాజ్యాంగమని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అన్నారు. ఎంతో మహనీయత కలిగిన రాజ్యాంగాన్ని కాపాడుకొనే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్‌ నివాళులర్పించారు. కుల, మత, జాతి వర్ణ వివక్ష లేకుండా ప్రతీ పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే రాజ్యాంగం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, డీఆర్‌వో కొండయ్య, కలెక్టరేట్‌ ఏవో టి.మోహన్‌రావు పాల్గొన్నారు. 

ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు..

రాజ్యాంగ ఆమోద దినోత్సవం నగరంలో పలుచోట్ల శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జడ్పీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో మోహనరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి యువజన సంక్షేమశాఖ సీఈవో డాక్టర్‌ వి.శ్రీనివాసరావు, మేనేజర్‌ డి.సర్వేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొగాకుబోర్డు కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చుట్టుగుంట సెంటర్‌ పాతమార్కెట్‌ యార్డు ఆవరణలోని ఉద్యానవనశాఖ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి ఆ శాఖ జేడీ పావులూరి హనుమంతరావు, ఉద్యానశాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు డి.భానూజిరావు, డీడీ హిమబిందు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాంతీయ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో..

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్సీ సెల్‌ నేత బొల్లెద్దు సుశీలరావు, కనపర్తి శ్రీనివాసరావు, యల్లవుల అశోక్‌ యాదవ్‌, గుడిమెట్ల దయరత్నం, బొబ్బిలి రామారావు, సౌపాటి రత్నం, చిలక వెంకటేశ్వరరావు,నాగరాజు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లాడ్జీసెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు రావెల కిషోర్‌బాబు, బుజ్జిబాబు, ఏడుకొండలు, బుల్లిబాబు, ఏసేబు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఆపార్టీ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్‌, కోటామాల్యాద్రి, మంగా శ్రీనివాస్‌, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్‌ రోడ్డులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా.. అంబేద్కర్‌ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. 

విద్యాసంస్థల్లో..

ఏసీ న్యాయ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డి.గురవయ్య.. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాది చిగరుపాటి రవీంద్రబాబు, జి.శ్రీకాంత్‌, పాల్‌సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. మెడికల్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుధాకర్‌, కళశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మావతి, జీజీహెచ్‌ ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరమ్మ, మద్దు ప్రేమ్‌జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. టీజేపీఎస్‌ కళాశాలలో జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ భాను మురళీధర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జేవీ సుధీర్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు. సర్వర్ణభారతినగర్‌ జడ్పీ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో దళితబహుజన రిసోర్స్‌ సెంటర్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ చుక్క శామ్యూల్‌ అనిల్‌ కుమార్‌, హేమలతాదేవి, డీబీఆర్‌సీ సిటీ కోఆర్డినేటర్‌ జూలపల్లి మంజుల, రవితేజ, స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీసరస్వతి కమిటీ ఎయిడెడ్‌ స్కూల్‌లో జరిగిన వేడుకల్లో 2వ డివిజన్‌ కార్పొరేటర్‌ మర్రి అంజలి, హెచ్‌ఎం పి.విజయక్ష్మి,  పూర్వ విద్యార్థులు మర్రి సత్యనారాయణ, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మి, పుల్లయ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌లో ఆర్జేడీ సుబ్బారావు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, ఎంఈవో కేఎంఎం ఖుద్దూస్‌, హెచ్‌ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సాంబశివపేలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగినవేడుకల్లో ప్రిన్సిపాల్‌ సునీత తదితరులు పాల్గొన్నారు. చౌత్రాసెంటర్‌లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఉర్దూ ఉప తనిఖీ అధికారి ఎస్‌కేఎండీ ఖాసిం, హెచ్‌ఎం విజయలక్ష్మీ పాల్గొన్నారు. విజనంపాడులోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకుడు సముద్రాల కోటేశ్వరరావు, కళాశాల చైర్మన్‌ కోయి సుబ్బారావు, కార్యదర్శి కోయి  శేఖర్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ కె.హరిబాబు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.బాబు తదితరులు పాల్గొన్నారు.

పలు సంఘాల ఆధ్వర్యంలో..

అంబేద్కర్‌ భవన్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి రాష్ట్ర షెడ్యూల్డ్‌ కుల సంక్షేమ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మేడిదబాబురావు పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో సీహెచ్‌ రవికుమార్‌, యోహాను, మేడిద రత్తయ్య, రాజేష్‌, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంరఽధ ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో ఏసుబాబుమాదిగ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో రవి, సుబ్బయ్య, అబ్బురం, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు.  సంఘం నాయకులు కొల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం, రవి, కొండలరావు, సుభాని, కోటి తదితరులున్నారు. అరండల్‌పేట ఒకటో లైనులో ఏపీ రాష్ట్ర రజక జన సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. 

Updated Date - 2021-11-27T05:04:30+05:30 IST