స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2021-08-03T05:43:49+05:30 IST

జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 15న జరిగే దేశ స్వాతంత్య్ర దిన వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, జిల్లా స్థాయి అధికారులు

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 15న జరిగే దేశ స్వాతంత్య్ర దిన వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఇతర ప్రజాప్రతినిధులు వేడుకలకు హాజరవుతారని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి గత ఏడాదికాలంలో ఉత్తమసేవలు అందించిన ఉద్యోగుల జాబితాలను 7వ తేదీ లోపు కలెక్టరేట్‌కి పంపించాలన్నారు. జిల్లాలో అమలవుతున్న నవరత్నాల కార్యక్రమాలపై స్టాల్స్‌, శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు దినేష్‌కుమార్‌, ప్రశాంతి, అనుపమ అంజలి, శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో కొండయ్య, జడ్పీ సీఈవో ఛైతన్య, డీపీవో కేశవరెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్‌రావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ నతానియేల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని పాల్గొన్నారు. 

కొవిడ్‌ నియంత్రణపై విస్త్రృత ప్రచారం

జిల్లావ్యాప్తంగా కొవిడ్‌-19 నియంత్రణపై విస్త్రృత ప్రచారంచేపట్టినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద కరోనా మూడోదశ వ్యాప్తి చెందే అవకాశంపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల ద్వారా ఆడియో జింగిల్స్‌ ప్రచార కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-03T05:43:49+05:30 IST