24 గంటల్లోనే కరోనా ఫలితాలు

ABN , First Publish Date - 2021-05-02T05:47:46+05:30 IST

జిల్లాలో నిత్యం చేస్తున్న కరోనా టెస్టుల రిపోర్టులు 24 గంటల్లోనే ఇవ్వాల్సిందిగా ఐసీఎంఆర్‌ ఆమోదం పొందిన ల్యాబ్‌ల నిర్వాహకులను ఆదేశించడం జరిగిందని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు.

24 గంటల్లోనే కరోనా ఫలితాలు

 సీఎస్‌కి నివేదించిన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యం  చేస్తున్న కరోనా టెస్టుల రిపోర్టులు 24 గంటల్లోనే ఇవ్వాల్సిందిగా ఐసీఎంఆర్‌ ఆమోదం పొందిన ల్యాబ్‌ల నిర్వాహకులను ఆదేశించడం జరిగిందని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. శనివారం సాయంత్రం కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ సింఘాల్‌, కాటమనేని భాస్కర్‌ నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌కి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. ఆక్సిజన్‌ సిలిండర్స్‌,, వెంటిలేటర్స్‌, బెడ్స్‌, కరోన పరీక్షలు, రెమ్‌డేసివిర్‌ ఇంజక్షన్ల వివరాలు తెలుసుకొన్నామన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్‌పై వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లని ఆడిట్‌ చేస్తూ పక్కదారి పట్టకుండా చూస్తున్నామన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులను హోం ఐసోలేషన్‌లోనే ఉంచి ఏఎన్‌ఎంల ద్వారా మెడికల్‌ కిట్‌లు అందించి డాక్టర్ల బృందం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో స్వల్ప లక్షణాలున్న వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తున్నామని  చెప్పారు. దీని వలన పడకలు అందుబాటులోకి వస్తోన్నాయన్నారు. ఈ సమావేశానికి జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, జేసీ(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో కొండయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-02T05:47:46+05:30 IST