ప్రజల మధ్యన చిచ్చు పెడితే చర్యలు

ABN , First Publish Date - 2021-01-14T05:27:12+05:30 IST

శాంతి, సామరస్యంతో జీవిస్తున్న ప్రజల మద్యన కుల, మతాల వైషమ్యాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ప్రజల మధ్యన చిచ్చు పెడితే చర్యలు

 కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరిక


గుంటూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): శాంతి, సామరస్యంతో జీవిస్తున్న ప్రజల మద్యన కుల, మతాల వైషమ్యాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కొత్తగా నియమించిన మతసామరస్య జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని స్వార్థ శక్తులు మత సామరస్యానికి విఘాతం కలిగించేలా విగ్రహాలపై దాడులకు తెగబడుతున్నాయన్నారు.  పవిత్ర కట్టడాల సంరక్షణకు సంబంధించి సెక్యూరిటీ ప్లాన్‌ని రూపొందించి అందించాలన్నారు. అర్బన్‌ ఎస్‌పీ అమ్మిరెడ్డి, రూరల్‌ ఎస్‌పీ విశాల్‌ గున్నీ, జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌ షరీఫ్‌, వివిధ మత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T05:27:12+05:30 IST