కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చింతా మోహన్ ఫైర్

ABN , First Publish Date - 2021-11-05T18:34:57+05:30 IST

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చింతా మోహన్ ఫైర్

గుంటూరు: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. దేశం చాలా దారుణమైన పరిస్థితులలో ఉందన్నారు. చైనా, భారత భూభాగంలోకి కొన్ని కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి శాశ్వత కట్టడాలు నిర్మించిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేదని, మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టమన్నారు. రాష్ట ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సమయానికి ఇవ్వలేకపోతోందని విమర్శించారు. ఏపీలో 80 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, మెస్ చార్జీలు నిలిచి పోయాయన్నారు. సంక్రాంతి పండుగ లోపు వారికి చెల్లించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని చింతా మోహన్ అన్నారు.

Updated Date - 2021-11-05T18:34:57+05:30 IST