నా బర్త్‌డేకు మూడు మొక్కలు నాటండి

ABN , First Publish Date - 2021-08-22T05:25:40+05:30 IST

ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలంటూ తన అభిమానులకు సినీ హీరో చిరంజీవి పిలుపునిచ్చారు.

నా బర్త్‌డేకు మూడు మొక్కలు నాటండి

అభిమానులకు చిరంజీవి పిలుపు 

హైదరాబాద్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలంటూ తన అభిమానులకు సినీ హీరో చిరంజీవి పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజైన ఆగస్టు 22న అందరూ మూడు మొక్కల చొప్పున నాటి తన ట్విటర్‌కు ట్యాగ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలన్నా, భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. చిరంజీవి చేసిన ట్వీట్‌పై ఎంపీ సంతోశ్‌కుమార్‌ స్పందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణ పట్ల మెగాస్టార్‌కు ఉన్న ప్రేమను ఇది తెలియజేస్తున్నదన్నారు. ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్‌.. ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2021-08-22T05:25:40+05:30 IST