గిన్నిస్ రికార్డులో చిన్నారి ఫజీల..
ABN , First Publish Date - 2021-05-08T05:35:33+05:30 IST
చిలకలూరిపేట పట్టణంలోని సుభానినగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఫజీలా ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది

చిలకలూరిపేట టౌన్, మే: చిలకలూరిపేట పట్టణంలోని సుభానినగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఫజీలా ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. రసాయనశాస్త్రంలోని ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలను అతి తక్కువ సమయంలో పేర్చడంలో ఫజీలా ఈ రికార్డు సాధించింది. కేవలం నిముషం 43 సెకండ్లలో చిన్నారి మూలకాలను పేర్చి 2 నిముషాల 29 సెకన్లతో ఉన్న పాకిస్థాన్ బాలిక రికార్డును అధిగమించింది. ఫజీలా తండ్రి రహీమ్ పెదనందిపాడులోని ప్రభుత్వ ఉర్దూ ప్రాఽథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని, మునిసిపల్ చైర్మన్ రఫాని, ఎంఈవో కె.లక్ష్మి తదితరులు చిన్నారి ఫజీలాను అభినందించారు.