చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి
ABN , First Publish Date - 2021-05-05T05:10:48+05:30 IST
చెరువులో పడి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన చెరుకుపల్లిలో చోటు చేసుకుంది.
చెరుకుపల్లి, మే 4: చెరువులో పడి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన చెరుకుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గౌడపాలెంకు చెందిన లచ్చి రవితేజ(21), వాకా మోహనకృష్ణ(15) స్థానిక రామయ్య చెరువులో ఎడ్ల బండి కడగడానికి వెళ్ళారు. బండి అదుపు తప్పి తిరగపడడంతో రవితేజ, మోహనకృష్ణ చెరువులో పడి నీట మునిగి మృతిచెందారు. యువకులు మృతిచెందడంతో గౌడపాలెంలో విషాదం అలముకొంది.