చెక్‌ పోస్టుల వద్ద నిఘా పటిష్టం చేయాలి

ABN , First Publish Date - 2021-08-25T05:56:40+05:30 IST

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని సరిహద్దుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి మద్యం అక్రమ రవాణాను నివారించాలని ఆంధ్రప్రదేశ బిస్లరీ అండ్‌ బేవరేజెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.వాసుదేవరెడ్డి తెలిపారు.

చెక్‌ పోస్టుల వద్ద నిఘా పటిష్టం చేయాలి
సమావేశం నిర్వహిస్తున్న ఏపీ బిస్లరీ అండ్‌ బేవరేజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.వాసుదేవరెడ్డి

ఏపీ బిస్లరీ అండ్‌ బేవరేజ్‌ ఎండి డి వాసుదేవరెడ్డి

గుంటూరు(కార్పొరేషన), ఆగస్టు 24: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని సరిహద్దుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి మద్యం అక్రమ రవాణాను నివారించాలని ఆంధ్రప్రదేశ బిస్లరీ అండ్‌ బేవరేజెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. మంగళవారం గుంటూరు ఎక్సైజ్‌ కార్యాలయంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ  గుంటూరు జిల్లాలో 30 టూరిజం మద్యం షాపులు, వాక్‌ఇన మద్యం షాపులు ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టూరిజంకు చెందిన 12 మద్యం షాపులను నంబూరు, అమరావతి, ముట్లూరు, నాగార్జునసాగర్‌, తాళ్లపల్లి, పల్లెకోన, సూర్యలంక దగ్గర ఉన్న ముత్యాలంపాడులో ప్రారంభించారని, వాక్‌ఇన మద్యం షాపులు గుంటూరులో 3, నరసరావుపేటలో 1, తెనాలిలో 1, రేపల్లె, మంగళగిరి ప్రాంతాల్లో ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో గుంటూరు డీసీ బి.అరుణ్‌రావు, ఒంగోలు ఏసీ బి.శ్రీరామచంద్రమూర్తి, ఐఎంఎల్‌ డిపో మేనేజర్‌లు సుధాకర్‌రెడ్డి (గుంటూరు), ఈ.శ్రీనివాసులు (నరసరావుపేట), కె.విజయ (తెనాలి), ఆర్‌.హనుమంతరావు (ఒంగోలు), వెంకటరామిరెడ్డి (నెల్లూరు), ఏఈఎస్‌లు, సీఐలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-25T05:56:40+05:30 IST