పుష్పరాజు త్వరగా కోలుకొని ప్రజాజీవితంలోకి రావాలి
ABN , First Publish Date - 2021-12-09T05:54:18+05:30 IST
మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌నేత జేఆర్ పుష్ఫరాజు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాజీవితంలోకి రావాలని ఆపార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
గుంటూరు, డిసెంబర్ 8(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌నేత జేఆర్ పుష్ఫరాజు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాజీవితంలోకి రావాలని ఆపార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కొవిడ్ తరువాత శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పుష్పరాజును గుంటూరులోని ఆయన నివాసంతో చంద్రబాబు బుధవారం పరామర్శించారు. కుటుంబసభ్యులను పలకరించారు. ఇటీవల కార్పొరేషన్ 42వ డివిజన్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో జైలుకు వెళ్లి వచ్చిన 70ఏళ్ల నున్నా లింగయ్యను చంద్రబాబు సత్కరించారు. రాజధాని గ్రామమైన అబ్బురాజుపాలెంకు చెందిన వైసీపీ నేత డేవిడ్‌రాజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్, పశ్చిమ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల జోసఫ్ ఇమ్మానియేల్, కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాం ప్రసాద్ (బుజ్జి), నూకవరపు బాలాజీ, నేతలు రావిపాటి సాయికృష్ణ, పానకాల వెంకట మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి చిట్టిబాబు ఇంట నిర్వహించి సుదర్శనయాగం, కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, హస్తకళల మాజీ డైరెక్టర్ వట్టికూటి హర్షవర్ధన్ ఇంట్లో వివాహ వేడుకలకు హాజరయ్యారు. గుంటూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు ఆపార్టీ శ్రేణులు అఖండ స్వాగతం పలికాయి. చుట్టుగుంట సెంటర్‌లో తూర్పు ఇన్‌ఛార్జ్ మహ్మద్ నసీర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో శ్రేణులు పాల్గొని చంద్రబాబును స్వాగతిస్తూ నినాదాలు చేశారు. గుజ్జగుండ్ల సెంటర్ వద్ద నుంచి కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద్ నేతృత్వం ర్యాలీ ఏర్పాటు చేశారు.