అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2021-10-28T05:36:41+05:30 IST
ఆర్థికాభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సెంట్రల్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ సురేష్‌కిష్‌నాని సూచించారు.

సీజీఎస్టీ చీఫ్ కమిషనర్ సురేష్‌కిష్‌నాని
గుంటూరు, అక్టోబరు 27: ఆర్థికాభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సెంట్రల్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ సురేష్‌కిష్‌నాని సూచించారు. సీజీఎస్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కిష్నాని బుధవారం కన్నావారితోటలోని సీజీఎస్టీ కమిషరేట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో సమావేశమైన ఆయన గుంటూరు కమిషరేట్ పరిధిలోని అధికారుల పనితీరును ప్రశంసించారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యలు, బదిలీలకు సంబంధించి గెజిటెడ్ సూపరింటెండెంట్ అసోసియేషన్ నాయకులు చీఫ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో సీజీఎస్టీ గుంటూరు కమిషనర్ ఫహీమ్ అహ్మద్, విల్సన్‌బాబు, గద్దె తిలక్, యుగంధర్, నందిపాటి శ్రీనివాస్, ప్రమీల, గుమ్మడి సీతారామయ్యచౌదరి, మూర్తి, పీవీ సత్యనారాయణ, ప్రకాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.