వ్యాపారి కుమారుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-20T05:31:56+05:30 IST
క్రోసూరులో స్టీల్ సామాన్ల వ్యాపారి అనుముల ప్రసాద్ కుమారుడు వెంకటేష్(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

క్రోసూరు, జనవరి 19: క్రోసూరులో స్టీల్ సామాన్ల వ్యాపారి అనుముల ప్రసాద్ కుమారుడు వెంకటేష్(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గోడౌన్‌లోని సామాన్లు తీసుకురావడానికి వెంకటేష్ ఉదయం వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం గోడౌన్‌కు వెళ్లి చూడగా బ్లేడుతో గొంతు కోసుకుని ఉన్నాడు. వారు పరిశీలించేప్పటికి మృతి చెందాడు. వ్యాపార నిర్వహణలో ఒడిదుడుకులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్ఐ బీ శివరామయ్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.