GNT : తమ్ముడూ.. ఈ లోకం విడిచి వెళుతున్నా..!
ABN , First Publish Date - 2021-12-03T18:54:05+05:30 IST
ఈ లోకం విడిచి వెళుతున్నట్లు ..

గుంటూరు: తాను ఈ లోకం విడిచి వెళ్తున్నానని బావాజీనగర్ మూడో లైనుకు చెందిన సయ్యద్ నజీముద్దీన్ తన తమ్ముడు తాజుద్దీన్కు ఫోన్లో సందేశం పంపాడు. వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగించే నజీముద్దీన్ అప్పుల భారంతో గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం తన తమ్ముడు తాజుద్దీన్ ఫోన్కు తాను ఈ లోకం విడిచి వెళుతున్నట్లు నజీముద్దీన్ మెసేజ్ పెట్టాడు. నజీముద్దీన్ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ్ముడి ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.