అట్రాసిటీ చట్టం దుర్వినియోగం తగదు

ABN , First Publish Date - 2021-08-21T05:43:03+05:30 IST

డాక్టర్‌ సుధాకర్‌ ఘటన నుంచి రమ్య హత్య వరకూ రాష్ట్రంలో దళితులపై అనేక దాడులు జరిగాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్‌బాబు అన్నారు.

అట్రాసిటీ చట్టం దుర్వినియోగం తగదు
రమ్య కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న నాయకులు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్‌బాబు

గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు20: డాక్టర్‌ సుధాకర్‌ ఘటన నుంచి రమ్య హత్య వరకూ రాష్ట్రంలో దళితులపై అనేక దాడులు జరిగాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్‌బాబు అన్నారు. శుక్రవారం బీజేపీ నాయకులు రమ్య కుటుంబ సభ్యులను గుంటూరులోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కిశోర్‌బాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ, టీడీపీ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రమ్య హత్య అత్యంత బాధాకరమని అన్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిశోర్‌ మాట్లాడుతూ ఈ నెల 24న జాతీయ ఎస్సీ కమిషన ఈ ఘటనపై విచారణ చేయనుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బుజ్జిబాబు, బోరుగడ్డ బుల్లిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కంతేటి బ్రహ్మయ్య, జోనల్‌ ఇంచార్జ్‌ మేకల లక్ష్మణ్‌, దారా అంబేద్కర్‌, కొర్రపాటి సురేష్‌, రాయపూడి ఏసోబు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కూచిపూడి సత్యం, ఏటుకూరి విజయ్‌, చలివేంద్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-21T05:43:03+05:30 IST