మైనార్టీల సంక్షేమానికి కేంద్రం పథకాలు

ABN , First Publish Date - 2021-10-29T05:27:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు.

మైనార్టీల సంక్షేమానికి కేంద్రం పథకాలు
రామకృష్ణను సత్కరిస్తున్న మైనార్టీ నాయకులు

గుంటూరు(సంగడిగుంట): కేంద్ర  ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని బీజేపీ  పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మైనార్టీ మోర్చా నాయకులు నాగుల్‌ మీరా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేల కోట్ల రూపాయల వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిపై రాజీలేని పోరాటం చేయాలని సూచాంచారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా పార్లమెంట్‌ ఇనచార్జి షేక్‌ అబ్దుల్‌ ఖుద్దుస్‌, జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎం బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2021-10-29T05:27:51+05:30 IST