అర్హులైనవారికి ఇళ్ల స్థలాలు అందలేదు..
ABN , First Publish Date - 2021-02-01T06:20:56+05:30 IST
నిజమైన పేదలకు స్థలాలు అందలేదంటూ మండల కేంద్రం భట్టిప్రోలు పంచాయితీ పరిధిలోని అద్దేపల్లి గ్రామస్తులు వైసీపీ నాయకులను నిలదీశారు.

వైసీపీ నాయకులను నిలదీసిన గ్రామస్తులు
భట్టిప్రోలు, జనవరి 31 : నిజమైన పేదలకు స్థలాలు అందలేదంటూ మండల కేంద్రం భట్టిప్రోలు పంచాయితీ పరిధిలోని అద్దేపల్లి గ్రామస్తులు వైసీపీ నాయకులను నిలదీశారు. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులతో ర్యాలీగా బయలుదేరేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు అద్దేపల్లి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఇళ్ళ స్థలాల కేటాయింపులో మోసం జరిగిందని నిలదీశారు. అవాక్కయిన నేతలు అందరికి వస్తాయి ఇస్తామంటూ అక్కడ నుంచి జారుకున్నారు.