లాలూప్రసాద్‌యాదవ్ కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2021-02-01T06:25:57+05:30 IST
బిహార్ మాజీముఖ్యమంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ బాపట్ల యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొబిషనల్స్ అసోసియేషన్ నాయకులు ఆదివారం దర్శి పెదమస్తాన్ నగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బాపట్ల, జనవరి 31: బిహార్ మాజీముఖ్యమంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ బాపట్ల యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొబిషనల్స్ అసోసియేషన్ నాయకులు ఆదివారం దర్శి పెదమస్తాన్ నగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గొర్ల శ్రీనివాసరావుతో పాటు ఆవుల వెంకటేశ్వర్లు, లంబు సాంబయ్య, ఇందేటి వెంకటేశ్వరరావు, గొర్ల ఆంజనేయప్రసాద్, పట్టెం చెంచు పున్నయ్య, యంపరాల వాసు, యలవల సాహిత్ తదితరులు పాల్గొన్నారు.