ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-02-07T05:28:03+05:30 IST

ఐదేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

బాధిత కుటుంబాన్ని నిందితుడు బెదిరింపులు

పట్టించుకోని పోలీసులు

కొల్లిపర మండలంలో దారుణం

కొల్లిపర, ఫిబ్రవరి 6: ఐదేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొల్లిపర మండలం దావులూరులో  బాలికపై జనవరి 29న అదే గ్రామానికి చెందిన సురేష్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురవడంతో విషయం తెలుసుకున్న బంధువులు కొల్లిపర పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పట్టించుకోకుండా సమస్యను మీరే తేల్చుకోండి అంటూ సమాధానం చెప్పారు.  ఇదే విషయంపై సురేష్‌ను బాలిక బంధువులు నిలదీశారు. దీంతో సురేష్‌, అతని మేనల్లుడు మహేష్‌ బాధితురాలైన బాలిక తల్లిని, అమ్మమ్మను, బంధువులను బెదిరింపులకు గురి చేయడంతో శనివారం మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తమకు తక్షణమే న్యాయం చేయాలని బాలిక బంఽధువులు వేడుకుంటున్నారు.  


Updated Date - 2021-02-07T05:28:03+05:30 IST